ఎట్ట‌కేల‌కు త‌న కారులో ఉన్న ఇద్ద‌రు అమ్మాయిలు ఎవ‌రో చెప్పేసిన ప్ర‌దీప్..!!

2 months ago
4770 Views

ప్రదీప్‌ గతకొన్ని రోజులుగా పోలీసుల కౌన్సెలింగ్‌కు హాజరుకాని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రదీప్‌ వస్తాడా? రాడా? అన్నది తెలియక పోలీసులు సైతం అయోమయంలో మునిగిపోయారు. కొన్ని రోజులు కౌన్సెలింగ్‌కు హాజరుకాకపోవడంతో పోలీసులు కేపీహెచ్‌బీలోని ఆయన కార్యాలయంతోపాటు మణికొండలోని నివాసంలో నోటీసులు అందించేందుకు ప్రయత్నించారు. అయితే, అతను అందుబాటులో లేకపోవడంతో వెనక్కి వచ్చారు.

దీంతో ప్రదీప్‌ పరారీలో ఉన్నట్లు ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. ఇది తెలుసుకున్న ప్రదీప్‌ గత శుక్రవారం వీడియో ద్వారా తాను త్వరలోనే కౌన్సెలింగ్‌కు హాజరుకాబోతున్నట్లు తెలిపారు.ఈ తరుణంలో ఎట్టకేలకు ట్రాఫిక్‌ పోలీసుల ముందు ప్రదీప్‌ హాజరయ్యాడు. సోమవారం మధ్యాహ్నం బేగంపేట ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో ప్రదీప్‌ కౌన్సెలింగ్‌కు హాజరవుతారని భావించారు. ఈ మేరకు ట్రాఫిక్‌ డీసీపీ చౌహాన్‌కు ప్రదీప్‌ సమాచారం కూడా అందించారు. కానీ ప్రదీప్‌ అనూహ్యంగా గోషామహల్‌ ట్రాఫిక్ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు…

ప్ర‌దీప్ త‌న తండ్రితో పాటు కౌన్సిలింగ్ కు హాజ‌ర‌య్యాడు. గంటకుపైగా ప్రదీప్‌ కౌన్సెలింగ్‌ కొనసాగింది.డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ వల్ల కలిగే అనర్థాలు వివరించడంతోపాటు.. మరోసారి తాగి వాహనం నడుపవద్దంటూ ప్రదీప్‌కు పోలీసుల సూచనలు ఇచ్చినట్టు తెలుస్తోంది. తండ్రితో కలిసి ప్రదీప్‌ కౌన్సెలింగ్‌కు హాజరయ్యాడు. వాహనం నడుపుతున్న సమయంలో ఏరకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది కుటుంబసభ్యులకు పోలీసులు వివరించారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా కారు అద్దాలకు బ్లాక్‌ఫిలిం ఏర్పాటు చేసుకున్న ఘటనలోనూ ప్రదీప్‌పై పోలీసులు జరిమానా విధించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక కౌన్సిలింగ్ పూర్త‌యిన క్ర‌మంలో ప్ర‌దీప్ ను పోలీసులు కోర్టులో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. దీంతో ప్ర‌దీప్ కు ఎన్ని రోజులు శిక్ష ప‌డుతుంద‌నేది ఉత్కంఠ‌గా మారింది. శిక్ష వేయ‌కుండా జ‌రిమానంతో స‌రిపెడ‌తారా అనే దానిపై కూడా చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇక పోలీసులు అనంత‌రం మీడియాతో మాట్లాడారు ప్ర‌దీప్. పోలీసుల కౌన్సెలింగ్‌లో చాలా విషయాలు తెలుసుకున్నాను. కౌన్సెలింగ్‌ చాలా కీలకమైంది. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ వల్ల ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయన్నది తెలుసుకున్నానని అన్నారు. తాగి నడపడం వల్ల శరరీంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఎందుకు తాగి నడపకూడదు అన్నది కౌన్సెలింగ్‌లో చాలా క్లారిటీగా పోలీసులు వివరించారన్నారు ప్ర‌దీప్. ఈ విషయాలను నాకు తోచినంత వరకు మిగతావారికి చెప్పేందుకు ప్రయత్నిస్తానన్నారు.

ఈ విషయంలో నాకు సహకరించిన ట్రాఫిక్‌ పోలీసులు, మీడియా, కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులకు అందరికీ ధన్యవాదాలు అని ప్రదీప్‌ అన్నారు.అనంతరం ప్రదీప్‌ మీడియాతో మాట్లాడారు. పోలీసులు ఇచ్చిన తేదీ ప్రకారమే తాను కౌన్సెలింగ్‌కు హాజరయ్యానని, తాను కౌన్సెలింగ్‌కు రాకపోవడం ఏమీలేదని ప్రదీప్‌ తెలిపారు. ఈ విషయంలో చట్టప్రకారంగా నిబంధనలన్నింటినీ అనుసరించినట్టు తెలిపారునేను చేసింది దయచేసి ఇంకెవరూ చేయకండి అని కౌన్సిలింగ్ ముగిస‌న అనంత‌రం ప్ర‌దీమ్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఎవ‌రూ తాగి డ్రైవ్ చేయ‌వ‌ద్ద‌ని సూచించారు.
ఈ క్రింది వీడియో చూడండి…

అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప‌ట్టుబ‌డిన స‌మ‌యంలో ప్ర‌దీప్ కారులో ఇద్ద‌రు అమ్మాయిలు ఉన్నారు. దీంతో ఆ ఇద్ద‌రు అమ్మాయిలు ఎవ‌ర‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఆ ఇద్ద‌రు అమ్మాయిల‌పై పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో చ‌ర్చ న‌డుస్తోంది. ప్ర‌దీప్ కారులో ఉన్న అమ్మాయిల‌పై ర‌క‌ర‌కాల గాసిప్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. ఈ క్ర‌మంలో పోలీసులు కౌన్సిలింగ్ లో ప్రదీప్ ను త‌న కారులో ఉన్న ఇద్ద‌రు అమ్మాయిలు ఎవరు అని ప్రశ్నించిన‌ట్లు స‌మాచారం. దానికి ప్రదీప్ పోలీసుల‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆ అమ్మాయిల‌ గురించి మిరేవ్వరు నన్ను ప్రశ్నించవద్దు.

ఒకవేళ మీకు అదే కావాలని ప్రశ్నించిన కూడా నేను దానికి సమాధానం చెప్పను అని అన్న‌ట్లు స‌మాచారం. అంతేకాకుండా అసలు ఆ అమ్మాయి ఎవరైతే మికేంటి ఎందుకు ఆ అమ్మాయిని టార్గెట్ చేస్తున్నారు అంటూ ప్రదీప్ పోలీసుల‌పై కాస్త సీరియస్ అయ్యారట‌. తాగి కారు డ్రైవ్ చేసి దోరికింది నేనే.. కారులు ఉన్న అమ్మాయిల‌తో మీకేం ప‌ని అని అన్న‌ట్లు తెలుస్తోంది ఇక మీడియా వారు కూడా ఆ ప్రశ్న గురించి ప్ర‌దీప్ ని అడ‌గ్గా అమ్మాయిల గురించి ప్ర‌శ్న‌ నాద్దగ్గరకు తీసుకురావద్దు అంటూ మీడియా ప్ర‌తినిధుల‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు.

Comments

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *